కలం వెబ్ డెస్క్: నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ శాఖల్లో 290 ఉద్యోగాల భర్తీ కోసం టీజీపీఎస్సీ (TGPSC) మూడు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ పోస్టులన్నీ సివిల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఉన్నాయి. ఇక పోస్టుల వివరాలను పరిశీలిస్తే.. ఆర్ అండ్ బీ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ సివిల్ 222, ఎలక్ట్రికల్ 49, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 19 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. నోటిఫికేషన్ మేరకు అభ్యర్థుల వయోపరిమితి 2026 జూలై 1 నాటికి నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఇక ఆర్ అండ్ బీ శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) పోస్టులకు జూన్ 6 నుండి జూలై 13 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అలాగే అదే శాఖలో 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులకు జూన్ 8 నుండి జూలై 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో పాటు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లోని 19 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి జూన్ 10 నుండి జూలై 17 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు.
Read Also: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి సేవలో ప్రముఖులు
Follow Us On : WhatsApp

