కలం, వెబ్ డెస్క్: తిరుపతి (Tirupati)లో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, పర్యాటకులకు సౌకర్యమైన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో శ్రీనివాస సేతుగా నిర్మాణం అందుబాటులోకి వచ్చింది. టీటీడీ బోర్డు నిర్ణయం మేరకు దీనికి ‘గరుడ వారధి’ పేరునే కొనసాగిస్తున్నారు. తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్, టీటీడీ సంయుక్తంగా సుమారు 7 కిలోమీటర్ల పైగా పొడవుతో సుమారు 684 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమైంది. ఈ వారధి నగరంలోని ట్రాఫిక్ సమస్యలకు ప్రధాన పరిష్కారంగా నిలుస్తోంది. 2023 సెప్టెంబర్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ ఫ్లైఓవర్ టూరిస్టులు ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా నేరుగా అలిపిరి వరకు చేరుకోవడానికి ఉపయోగపడుతోంది.
అయితే ఇటీవల ఈ వారధిపై తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలోని గరుడ వారధి (Garuda Varadhi)పై కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమలుకానున్నాయి. ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాలకు నిషేధించినట్టు జిల్లా యంత్రాంగం పేర్కొంది. తరచూ జరిగే ప్రమాదాల నివారణకు ఈ నిర్ణయం తీసుకున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Also: దేశంలోనే రిచెస్ట్ మహిళా ఎమ్మెల్యేలు ఏపీలోనే.. ADR రిపోర్ట్
Follow Us On : WhatsApp

