epaper
Wednesday, February 18, 2026
epaper

నూతన కమిషనర్లు బాధ్యతలు స్వీకరణ

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ను మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా నూతనంగా నియమితులైన కమిషనర్లు (GHMC Commissioners) తమ బాధ్యతలను స్వీకరించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఆర్‌వీ కర్ణన్ తన విధులను యథావిధిగా కొనసాగిస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా సృజన బాధ్యతలు చేపట్టగా, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా వినయ్ కృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించి విధుల్లో చేరారు. అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్‌ ఈ మూడు కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరిచారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>