సీతంపేటలో ప్రత్యేక బతుకమ్మ వేడుకలు

కలం, హనుమకొండ: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం సీతంపేట (Seethampet)లో నేతకాని కులస్థులు ప్రత్యేక బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ బతుకమ్మను పేర్చి పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, హనుమకొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి హాజరయ్యారు. ప్రత్యేక ఆచారాలు, సంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. వారసత్వంగా వస్తున్న సాంస్కృతిక వైభవాన్ని, ప్రత్యేక గుర్తింపును నిలబెట్టుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రేణుకుంట్ల అశోక్, నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>