కలం, వెబ్ డెస్క్ : ఆలయాల ప్రసాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు ఆలయాల్లో కల్తీ నెయ్యితో ప్రసాదాలు పంచారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. శ్రీశైలం ఆలయ ప్రసాదంలోనూ కల్తీ జరిగిందన్నారు. బాత్ రూమ్ లు క్లీన్ చేసే కెమికల్స్ తో తిరుమల లడ్డూ (Tirumala Laddu) తయారు చేశారని ఆరోపించారు. ఎన్డీడీబీ నివేదిక ఆధారంగానే తాను మాట్లాడుతున్నాని చెప్పారు. లడ్డూ వ్యవహారంపై సీబీఐ, సిట్ క్లీన్ చిట్ ఇచ్చినట్లు మాట్లాడుతున్నారని వైసీపీ నేతలపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. కల్తీ జరిగినట్లు సిట్ రిపోర్టులో ఉందని వైవీ సుబ్బారెడ్డే స్వయంగా చెప్పారని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
Read Also: పవన్ సార్.. మా గ్రామానికి రోడ్లు వేయించండి: చిన్నారుల రిక్వెస్ట్
Follow Us On : WhatsApp


