కలం, వరంగల్ బ్యూరో: స్కూల్ బస్సు ఢీకొని బాలుడు మృతిచెందిన విషాద ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ (Nekkonda) మండలంలో చోటుచేసుకుంది. బాధితులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని పిట్టకాలుబోడుతండ గ్రామానికి చెందిన అఖిల దంపతుల కుమారుడు రాహుల్ (2) ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో నెక్కొండ పట్టణంలోని విద్యోదయ హైస్కూల్ పాఠశాలకు చెందిన బస్సు బాలుడిని ఢీకొట్టినట్లు (Bus Accident) గ్రామస్తులు తెలిపారు. ఈ ప్రమాదంలో బాలుడి తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ బస్సును అక్కడే వదిలిపెట్టి పరారైనట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

