Mobile Popup Ad
Mobile Popup Ad

నీట్ రీఎగ్జామ్ పేపర్ కూడా లీక్ ?.. ఎన్టీయే క్లారిటీ..!

కలం, వెబ్ డెస్క్ : మే 3న జరిగిన నీట్-యూజీ 2026 (NEET UG 2026) పరీక్షలో అవకతవకలు జరగడం, ప్రశ్నాపత్రం లీక్ కావడంతో ఆ పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. సుమారు 22 లక్షల మంది విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, జూన్ 21న నీట్ రీఎగ్జామ్ నిర్వహిస్తుండగా.. ఆ పరీక్ష పేపర్ కూడా లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సీరియస్ అయింది. ఈ ప్రచారం అవాస్తవమమని, విద్యార్థులను మోసం చేయడానికి కొందరు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని క్లారిటీ ఇచ్చింది.

ఈ క్రమంలోనే పరీక్ష నిర్వహణకు అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని, పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపింది. విద్యార్థులు అధికారిక సమాచారం కోసం NTA వెబ్‌సైట్‌ను మాత్రమే అనుసరించాలని సూచించింది. తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. కాగా, ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు జూన్ 14 నాటికి విడుదలయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>