‘కడ’ అభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: నారాయణపేట (Narayanpet) జిల్లా కొడంగల్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కడ) పరిధిలోని మద్దూరు, కొత్తపల్లి, గుండుమల్, కోస్గి మండలాల్లో అభివృద్ధి పనులను ఇతర మండలాల్లో కొనసాగించేలా ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు. ఎన్ని నిధులు అవసరం.. ఇంకా కొత్తగా ఏం చేయొచ్చనే ఆలోచనలతో డాక్యుమెంటరీ తయారు చేయాలని సూచించారు.

సీఎస్ఆర్ నిధులతో..

శుక్రవారం కలెక్టరేట్‌లో కడ పరిధి మండలాలతో పాటు జిల్లాలోని మిగతా అన్ని మండలాల్లో అభివృద్ధి పనులు, పథకాలపై సుదీర్ఘ సమీక్ష చేశారు. సీఎస్‌ఆర్ నిధులతో చేపట్టే కార్యక్రమాలపైనా ఆరా తీశారు. డీఆర్వో రాజేశ్వరి, డిప్యూటీ కలెక్టర్ ఫణి కుమార్, జడ్పీ సీఈవో శ్రీనివాస్ రావు, డీఆర్డీవో వెంకట్ రాములు, సీపీఓ కాగా వాహాన్, డీఏవో సక్రియ నాయక్, హార్టికల్చర్ అధికారి సాయిబాబా, డీఎంహెచ్ఓ జయ చంద్రమోహన్, హౌసింగ్ పీడీ శంకర్ నాయక్, డీఈఓ గోవింద రాజులు, విద్యుత్ శాఖ ఎస్ఈ నవీన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>