జగన్‌కు లోకేశ్ బంపర్ ఆఫర్.. క్రికెట్ మ్యాచ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్

కలం, వెబ్ డెస్క్: ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీ20 వరల్డ్‌కప్‌లో (T20 World Cup) భాగంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ చూసేందుకు తాను సొంత ఖర్చులతో శ్రీలంక వెళ్లడంపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. “టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు వెళ్తే.. ఆ మ్యాచ్ చూడటానికి నేను తప్పకుండా మళ్లీ వెళ్తాను. ఒకవేళ జగన్ (YS Jagan) కూడా వస్తే.. ఆయనకు కూడా నేనే టికెట్ కొనిస్తా. నా ఖర్చులతోనే మ్యాచ్‌కు తీసుకెళ్తా” అని లోకేశ్ సెటైర్లు వేశారు. క్రికెట్ మ్యాచ్‌ చూసేందుకు విదేశాలకు వెళ్లడంపై జగన్ చేసిన విమర్శలు అర్థంలేనివని, తన సొంత డబ్బుతో తాను ఎక్కడికైనా వెళ్లే హక్కు తనకు ఉందని లోకేశ్ (Nara Lokesh) తేల్చి చెప్పారు.

Read Also: సునీల్ నాయక్ అరెస్ట్.. పెద్ద షాక్ తప్పదా..?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>