కలం, సినిమా : న్యాచురల్ స్టార్ నాని (Nani), టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ “ది ప్యారడైజ్” (The Paradise). సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగష్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దసరా వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత నాని, శ్రీకాంత్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాలో (The Paradise) నాని సరసన కయాదు లోహార్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 24 నాని బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగల్ “ఆయా షేర్” (Aaya Sher)ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా “ఆయా షేర్” ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమో ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటుంది. నాని సరికొత్త మేకోవర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. రేపు ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Read Also: సమంత ‘ మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్
Follow Us On: Instagram


