మిషన్ భగీరథకు అంతరాయం వచ్చినా నీటి సరఫరా ఆగొద్దు: అదనపు కలెక్టర్

కలం, జడ్చర్ల: జడ్చర్ల (Jadcherla) మున్సిపాలిటీలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రావద్దని, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ (Madhusudan Naik) అధికారులను ఆదేశించారు. బుధవారం జడ్చర్లలో నిరంతర తాగునీటి సరఫరా (Drinking Water Supply) అందించేందుకు చేపట్టిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయాలు ఏర్పడిన సమయంలో కొన్ని వార్డులకు తాగునీరు అందించేందుకు చేపట్టిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను, పైప్‌లైన్ లీకేజీల మరమ్మతు పనులను ఆయన మున్సిపల్ కమిషనర్‌తో కలిసి పరిశీలించారు. అలాగే బోరుబావుల పునరుద్ధరణ, పాత తాగునీటి వనరులను తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చే పనుల పురోగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడి, పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. మిషన్ భగీరథ సరఫరాలో అంతరాయాలు ఏర్పడినప్పటికీ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా నిరంతర నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>