పార‌డైజ్ సాంగ్‌.. నాని, కీర్తి సురేష్ ఫ‌న్నీ ఫ‌న్నీ పోస్ట్‌!

క‌లం, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని (Nani) త‌న‌ లేటెస్ట్ మూవీ ది పార‌డైజ్‌ (The Paradise)లోని ఒక సాంగ్ గురించి ఎక్స్ వేదిక‌గా ఓ ఆస‌క్తికర పోస్ట్ చేశారు. తెలంగాణ‌కు చెందిన ఏశ నాగుల గ‌డ్డ మీద అనే పాట‌ను పార‌డైజ్‌లో వాడుతున్న‌ట్లు ఇప్ప‌ట‌కే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిపోయింది. ఇదే విష‌యాన్ని నాని అధికారికంగా వెల్ల‌డిస్తూ ఓ పోస్ట్ చేశారు. దీనికి హీరోయిన్ కీర్తి సురేష్‌ (Keerthy Suresh)ను ట్యాగ్ చేయ‌గా వీరిద్ద‌రి మధ్య సోషల్ మీడియాలో సాగిన సరదా సంభాషణ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టులు వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్‌ను, రాబోయే ప్రాజెక్ట్‌పై అంచనాలను మ‌రింత పెంచేస్తున్నాయి.

నాని తన సోషల్ మీడియా వేదికగా ‘పారడైజ్’ సినిమాలోని ఒక పాట గురించి ప్రస్తావిస్తూ మ‌నం ఊగుద‌మే బాలా.. అంటూ కీర్తి సురేష్‌ను ట్యాగ్ చేశారు. దీనికి అంతే చురుగ్గా స్పందించిన కీర్తి సురేష్ వాడ‌డి జ‌డ‌ల‌ను ముట్టుకుంటే వాడికి స‌ర్రుమంటుంది అంటూ తనదైన శైలిలో సరదాగా రిప్లై ఇచ్చారు.

ఈ చిన్న క్యూట్ సంభాషణ ప్రస్తుతం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వీరిద్దరి మధ్య ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఎంత బాగుంటుందో, సోషల్ మీడియాలో వారి రియల్-లైఫ్ బాండింగ్ కూడా అంతే ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ పాట‌ను శ‌నివారం రిలీజ్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>