సీఎంకు రాఖీ కట్టిన అనంతరం కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు!

కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన అనంతరం మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ శుభాకాంక్షలు తెలుపుతూ రాఖీ కట్టినట్లు మంత్రి కొండా సురేఖ (Konda Surekha) వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన బంగారు రాఖీని ఆయనకు కట్టడంతో పాటు, వారి అల్లుడు, మనవడికి కూడా రాఖీలు శుభప్రదంగా కట్టానని తెలిపారు. మంత్రి సీతక్కతో కలిసి ముఖ్యమంత్రిని కలిసి ఈ వేడుకను జరుపుకున్నట్లు ఆమె వివరించారు.

రాష్ట్రంలోని మహిళలందరి అండదండలు, మద్దతు ఎల్లప్పుడూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంటాయని కొండా సురేఖ పేర్కొన్నారు. అలాగే ఆడపడుచులందరిపై సీఎం ఆశీస్సులు నిరంతరం ఉండాలని ఆమె ఆకాంక్షించారు. పండుగ వాతావరణం ఉన్న శుభసమయంలో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయాలని తాను అనుకోవడం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో మంచి సుపరిపాలన అందించాలని కోరుకుంటున్నానని మంత్రి కొండా సురేఖ తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకి నడిపించేందుకు అవసరమైన శక్తిని, యుక్తిని భగవంతుడు ఆయనకు ప్రసాదించాలని ప్రార్థించారు. అదే సమయంలో సీఎం ఆశీర్వాద బలం రాష్ట్రంలోని ఆడపడుచులందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>