సీటు మార్చిన సీఎం..!

క‌లం, వెబ్‌డెస్క్: త‌మిళ‌నాడు అసెంబ్లీ (Tamil Nadu Assembly)లో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. సీఎం విజ‌య్ (CM Vijay) ముఖ్య‌మంత్రి పీఠాన్ని వ‌దిలి వేరే చోట కూర్చోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది. సాధార‌ణంగా అసెంబ్లీలో సీఎంకు ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. స్పీక‌ర్‌కు కుడి వైపున విశాల‌మైన కుర్చీ ఏర్పాటు చేస్తారు. అయితే గురువారం త‌మిళ‌నాడు అసెంబ్లీ సెషన్‌లో విజయ్ తన స్థానాన్ని వ‌దిలి, సభా నాయకుడు కెఎ సెట్టయన్, మంత్రి ఆధవ్ అర్జున్‌ల‌ మధ్యలో కూర్చొని కొత్త సంప్రదాయానికి తెరలేపారు.

గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా మంత్రులకు కేటాయించిన స్థానాల్లో కూర్చున్న దాఖలాలు లేవు. సాధారణంగా ఎమ్మెల్యేలు లేదా మంత్రులు తమ సహచరులతో మాట్లాడటానికి కొద్దిసేపు సీట్లు మారుతుంటారు. కానీ, ఒక ముఖ్యమంత్రి తన అధికారిక స్థానం నుంచి వచ్చి తోటి మంత్రుల వరుసలో కూర్చోవడం ఇదే మొదటిసారి అని ప్ర‌భుత్వ‌ వర్గాలు తెలిపాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>