చైనా–నేపాల్​ సరిహద్దుల్లో భూకంపం!

క‌లం, వెబ్‌డెస్క్: ఇప్ప‌టికే వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌లం అవుతున్న‌ చైనా-నేపాల్ (China-Nepal) స‌రిహ‌ద్దుల్లో భూ కంపం రావ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో గ‌ల నీజియాంగ్ న‌గ‌ర ప‌రిధిలోని లాంగ్‌చాంగ్ సిటీలో 5.1 తీవ్ర‌త‌తో భూకంపం సంభ‌వించింది. అయితే ప్ర‌కంప‌న‌ల‌తో ఏమేర‌కు న‌ష్టం జ‌రిగిందో తెలియాల్సి ఉంది.

మ‌రోవైపు చైనా ఇప్ప‌టికే నేపాల్‌కు మ‌రికొద్ది సేప‌ట్లో భారీ వ‌ర‌ద‌లు సంభ‌వించే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. ఈ నేప‌థ్యంలో టిబెట్ స‌రిహ‌ద్దుల్లో స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను కూడా నిలిపివేసింది. దీంతో నేపాల్ ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ప్రాణ భ‌యంలో రోడ్ల‌పై ప‌రుగులు పెడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>