మాకు ఇందిరమ్మ ప్లాట్లు ఇవ్వండి.. ప్రజావాణిలో మహిళల వినతి

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా నందిపేట్‌(Nandipet)కు చెందిన మహిళలు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. తమకు గ్రామంలో ఖాళీగా ఉన్న ఇందిరమ్మ ప్లాట్లను కేటాయించాలని ప్రజావాణిలో వినతిపత్రం అందించారు. 2008లో కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ పథకం కింద గ్రామంలో 10 ఎకరాల స్థలంలో 200 ప్లాట్లు మంజూరు చేశారని తెలిపారు. అందులో 140 మంది ఇళ్లు కట్టుకున్నారని మిగతా 60 ప్లాట్లు ఖాళీగానే ఉన్నాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. వాటిని పేదలకు పంపిణీ చేయాలని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ త్రిపాఠిని కోరుతూ వినతి పత్రం అందజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>