కలం, నిజామాబాద్ బ్యూరో: వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా నిజామాబాద్ జిల్లా నందిపేట్ (Nandipet) ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు అటవీ అధికారులు అటవీ సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వన్యప్రాణుల సంరక్షణ, అటవీ చట్టాలు, వన్యప్రాణులను వేటాడితే కలిగే చట్టపరమైన ఇబ్బందులను వివరించారు. ప్రకృతి వనరులను ఎలా సంరక్షించుకోవాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్ ఎస్.రాజ్‌కుమార్, ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సుధాకర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లింబాద్రి పాల్గొన్నారు.

