రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు నందిపేట్ విద్యార్థులు

కలం, నిజామాబాద్ బ్యూరో: నందిపేట్ (Nandipet) మండల కేంద్రంలోని గీత స్కూల్ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి రాష్ట స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో వారిని లయన్స్ క్లబ్ ఆఫ్ నందిపేట్ ఆధ్వర్యంలో శనివారం సవరించారు. పొలపల్లి నందిత (నందిపేట్), మందజి నిహారిక (తల్వేదా), మంతెన అక్షర (నందిపేట్), జోగిని ప్రేమలత (కొత్తపల్లి), కనుగుల దీక్షిత్ (నందిపేట్) విద్యార్థులను సన్మానించారు. రాష్ట స్థాయిలో రాణించి నందిపేట్ మండలం, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు మంద మహిపాల్, సెక్రటరీ గంగుల గంగాధర్, ట్రెజరర్ దేవుడు నరేష్, సభ్యులు గంగుల చిన్నయ్య, గంగుల జనార్దన్, జక్కుల నవకాంత్, పాఠశాల ప్రిన్సిపాల్ కానూరి సాగర్, పీఈటీ ముత్యం తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>