కునో పార్కులో ఐదు చీతాలకు జన్మనిచ్చిన జ్వాలా!

క‌లం, వెబ్ డెస్క్‌: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌ (Kuno National Park)లో నమీబియాకు చెందిన చీతా జ్వాలా (Cheetah Jwala) సోమ‌వారం ఐదు కూనలకు జన్మనిచ్చింది. దీంతో దేశంలో మొత్తం చీతాల సంఖ్య 53కు చేరుకొని అర్ధశతకాన్ని దాటింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ (Bhupender Yadav) సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

నమీబియా (Namibia) నుంచి వచ్చిన జ్వాలా భారత్‌లో మూడోసారి కూన‌ల‌కు జ‌న్మ‌నిచ్చి రికార్డు సృష్టించింది. భారతదేశంలో చీతాలు జ‌న్మించ‌డం ఇది ప‌దోసారి కావ‌డం గ‌మ‌నార్హం. జ్వాలా (Cheetah Jwala) పిల్ల‌ల‌తో కలిపి భారత్‌లో పుట్టి, ఆరోగ్యంగా పెరుగుతున్న చీతా కూనల సంఖ్య 33కు పెరిగింది. అలాగే చీతాల సంఖ్య 50 దాటడం భారత వన్యప్రాణి సంరక్షణ చరిత్రలో ఒక చిరస్మరణీయ క్షణమని భూపేందర్ యాదవ్ అభివర్ణించారు. “జ్వాలా, త‌న‌ కూనలు ఆరోగ్యంగా పెరగాలని, భారత చీతా పునరుద్ధరణను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను” అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం కునో పార్కులో చీతాలు భారతీయ వాతావరణానికి చక్కగా అలవాటు పడుతున్నాయి. ఇటీవల దక్షిణాఫ్రికాకు చెందిన ‘గామిని’ కూడా నాలుగు కూనలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

Read Also: ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక: అలా చేస్తే తీవ్ర పరిణామాలు

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>