Mobile Popup Ad
Mobile Popup Ad

సేమ్ టూ సేమ్.. పోలికల్లోనే కాదు.. మార్కుల్లో కూడా!

కలం, నాగార్జునసాగర్ బ్యూరో: సాధారణంగా కవల పిల్లలు చూడటానికి ఒకేలా ఉండటం మనం చూస్తుంటాం. కానీ వీరిద్దరూ ఆలోచనల్లోనే కాదు, మార్కుల్లో కూడా తాము ఒక్కటే అని నిరూపించుకున్నారు. పదవ తరగతి ఫలితాల్లో ఇద్దరు కవలలకు ఒకే రకమైన మార్కులు రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. నల్గొండ (Nalgonda) జిల్లా పెద్దవూర మండల కేంద్రానికి చెందిన గుడిపాటి రామలింగం కుమారులైన శ్రీరామ్, లోకేష్‌లు కవల పిల్లలు. చిన్నప్పటి నుండి వీరిద్దరూ వెన్నంటే ఉంటూ ఒకే పాఠశాలలో విద్యనభ్యసించారు. ప్రతిభలోనూ పోటీ పడుతూ, తిరుమలగిరి సాగర్‌లోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో ఇద్దరూ ఒకేసారి సీట్లు సాధించారు.

బుధవారం విడుదలైన తెలంగాణ పదవ తరగతి ఫలితాల్లో ఈ అన్నదమ్ములు తమ అద్భుతమైన ప్రతిభను చాటారు. ఇద్దరు 549/600 మార్కులు సాధించారు. “ఇద్దరూ కలిసి చదువుకోవడం, ఒకరికొకరు సందేహాలు తీర్చుకోవడం వల్లే ఈ ఘనత సాధ్యమైంది. మార్కుల్లో కూడా ఇద్దరూ సమానంగా నిలవడం మాకు చాలా ఆనందంగా ఉంది.” అని వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. కవల పిల్లలు ఇద్దరికీ ఖచ్చితంగా 549 మార్కులు రావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఆశ్చర్యంతో పాటు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పదవ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన శ్రీరామ్, లోకేష్‌లను ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>