Mobile Popup Ad
Mobile Popup Ad

నల్గొండలో తీవ్ర విషాదం.. ఓ ఇంట్లో నలుగురు ఆత్మహత్య

కలం, నల్గొండ: తెలంగాణ రాష్ట్రం నల్గొండ (D) పట్టణంలోని నల్లగొండ సాగర్ రోడ్డు తెలంగాణ కాలనీలో సోమవారం తీవ్ర విషాద ఘటన జరిగింది. ఓ ఇంట్లో నలుగురు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికంగా భయబ్రాంతులకు గురిచేసిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. నలుగురి మృతదేహాలు లభ్యమవడం స్థానికులను షాక్ కు గురిచేస్తోంది. డాన్ బాస్కో స్కూల్ సమీపంలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషుల మృతదేహాలను గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు షేక్ సుల్తాన్, అతని భార్య హసీనా, వాళ్ల ఇద్దరు పిల్లలుగా గుర్తించారు. మృతుల ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>