పెళ్లిపాకాల భూ బాధితుల గోస.. నల్లగొండ తీవ్ర ఉద్రిక్తత

కలం, నల్లగొండ: పెళ్లిపాకాల (Pellipakala) ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన గ్రామ నిర్వాసితులు తమకు రావలసిన నష్టపరిహారం కోసం జిల్లా కలెక్టరేట్‌లో చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం మంజూరై ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ తమ చేతికి రూపాయి అందలేదని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు.

నష్టపరిహారం నిలిపివేతపై బాధితులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్‌డీసీ) యూనిట్-1 అధికారి లీలను నేరుగా నిలదీశారు. అధికారులకు ముడుపులు చెల్లించనందుకే తమ పరిహారం నిధులు విడుదలకు నోచుకోకుండా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ క్రమంలో న్యాయం చేయాలని వేడుకుంటూ కొందరు భూ బాధితులు ఎస్‌డీసీ కాళ్లపై పడి అభ్యర్థించినా అధికారులు కనికరించకపోవడం కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ప్రతిఒక్కరినీ కలచివేసింది. బాధితుల ఆందోళనపై ఎస్‌డీసీలీల స్పందిస్తూ.. ఈ వ్యవహారంలో మూడు కోర్టు వివాదాలు, కేసులు పెండింగ్‌లో ఉన్నందున పరిహారం పంపిణీ ఆలస్యమవుతోందని వివరణ ఇచ్చారు.

అయితే, తొమ్మిదేళ్లుగా సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని, ఏళ్ల తరబడి కలెక్టరేట్ చుట్టూ తిరిగినా అధికారులు కరుణించడం లేదని భూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల ఆందోళన, అధికారుల తీరుతో కలెక్టరేట్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>