నల్గొండలో అర్ధరాత్రి పోలీసుల నాకాబందీ.. భారీగా కేసులు నమోదు

కలం, నల్లగొండ : నల్లగొండ (Nalgonda) పట్టణ వ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి పోలీసులు విస్తృతంగా ప్రత్యేక ‘నాకాబందీ’ (వాహనాల తనిఖీలు) (Nakabandi) నిర్వహించారు. నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల అమలు, ప్రజల భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. పట్టణ పరిధిలోని 17 చెకింగ్ పాయింట్లలో 7 గురు సీఐలు, 24 మంది ఎస్ఐల ఆధ్వర్యంలో సుమారు 200 మంది పోలీసు సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

ఈ అర్ధరాత్రి తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 91 మందిపై కేసులు నమోదు చేశారు. సరైన పత్రాలు, నిబంధనలు పాటించని 146 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న 73 వాహనాలు, పత్రాలు లేని 81 మందిపై చర్యలు తీసుకున్నారు. హెల్మెట్ లేని వారు 97 మంది, ట్రిపుల్ రైడింగ్ కేసులు 30, మైనర్ డ్రైవింగ్ కేసులు 09 నమోదు కాగా.. శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న 04 మోడిఫైడ్ సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు.

వాహనాలకు ఉన్న 02 బ్లాక్ ఫిల్మ్‌లను తొలగించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి 134 ఈ-చలాన్లు, 11 ఈ-పెట్టి కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీసులు 12 మంది రౌడీ షీటర్ల కదలికలను స్వయంగా పరిశీలించారు. ఆధునిక ‘పాపిలాన్’ పరికరం ద్వారా ఇద్దరు అనుమానితులను గుర్తించి, వారి పూర్తి వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

ప్రజల ప్రాణాల రక్షణే పోలీసు శాఖ ప్రథమ ప్రాధాన్యత. మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ లేకపోవడం, మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ వంటివి ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలకు దారితీస్తాయి. ప్రతి ఒక్కరూ వాహన పత్రాలను వెంట ఉంచుకోవాలి. ప్రజల భద్రత కోసం జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ప్రత్యేక నాకాబందీ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి. ఈ ప్రత్యేక తనిఖీ కార్యక్రమాల్లో జిల్లా అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, పలువురు సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read Also: లీకేజీలు, వైరింగ్ లోపాలను ముందే కనిపెట్టే సరికొత్త గ్యాడ్జెట్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>