Mobile Popup Ad
Mobile Popup Ad

నల్లగొండలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత..

కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ (Nalgonda) మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 32వ డివిజన్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేరే ప్రాంతం వ్యక్తులతో ఓట్లు వేయిస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ (BRS) నాయకులు అడ్డగించారు. దీంతో బీఆర్ఎస్ నాయకులను నల్గొండ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని బీఆర్ఎస్ లీడర్లు పోలీసులపై ఆరోపణలు చేశారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్ వ్యక్తిని విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ శ్రేణులు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి (Kancharla Bhupal Reddy) రోడ్డుపై బైఠాయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు, బీఆర్ఎస్ లీడర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇదిలా ఉంటే.. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని కొన్ని వార్డుల్లో పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు నమోదు చేయించారంటూ మొదటి నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>