నల్లగొండ DTDO డిప్యూటేషన్ రద్దు.. కారణం ఏమిటి?

కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ జిల్లాలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి (Nalgonda DTDO) ఎం. చత్రునాయక్ డిప్యూటేషన్ రద్దయ్యింది. చత్రునాయక్‌పై ఇప్పటికే క్రమశిక్షణా (Disciplinary) కేసు పెండింగ్‌లో ఉండగా, జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సమయంలో అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నల్లగొండలో పనిచేస్తున్న ఎం. చత్రునాయక్‌ను ఆయన అసలు స్థానమైన మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు వెంటనే రిలీవ్ చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

అదే సమయంలో నల్లగొండ ఏటీడీఓ (ATDO) ఎం. శ్రీనివాస్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారిగా తాత్కాలిక బాధ్యతలు స్వీకరించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. గతంలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని వసతి గృహాల్లో ఉద్యోగాల విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>