కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ నిప్పులు

కలం, నల్లగొండ :  నల్లగొండ (Nalgonda)  జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ (BRS) తీవ్ర విమర్శలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే ప్రాజెక్టులపై విషప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ (BRS) జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ (Ramavath Ravindra Kumar) మండిపడ్డారు. నల్లగొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు హైకోర్టు తీర్పుతోనే తేలిపోయాయని ఆయన పేర్కొన్నారు. ఈ కమిషన్ ఏర్పాటు రాజకీయ కక్షసాధింపులో భాగమేనని ఆరోపించిన రవీంద్ర కుమార్, మేడిగడ్డ కూలిపోయిందన్న ప్రచారం పూర్తిగా అబద్ధమని అన్నారు. మరమ్మతులను కావాలనే అడ్డుకుని ప్రాజెక్టును నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.

ముఖ్యమంత్రి, మంత్రివర్గం పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పని చేస్తున్నట్లుగా కనిపిస్తోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు వల్ల డిండి లిఫ్ట్‌కు నష్టం జరుగుతోందని, దీనిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని నేతలు ఆరోపించారు. ప్రస్తుతం రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అస్తవ్యస్త పరిస్థితి నెలకొందని తెలిపారు. యూరియా కొరత, విద్యుత్ కోతలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు రేపటి నుంచి జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ బృందం సందర్శించనుందని ప్రకటించారు. సమస్యలు పరిష్కరించకపోతే కలెక్టరేట్ ముట్టడికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: టీఎంసీ ఖేల్ ఖతమ్ : అమిత్ షా

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>