ఆర్టీసీ సమ్మె వేళ.. సొంత పార్టీపై జగ్గారెడ్డి సెటైర్లు!

కలం మెదక్ బ్యూరో: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy).. నిత్యం వార్తలో ఉండే వ్యక్తి. ఎప్పుడు ఏదో ఒక విషయమై మాట్లాడే నేత. తాజాగా ఆయన ఆర్టీసీ కార్మికుల సమ్మె (RTC Strike) నేపథ్యంలో సొంత పార్టీ కాంగ్రెస్ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ.. ఏ పార్టీ అయినా ప్రజా సమస్యలపై ఒకే విధంగా స్పందించాలన్నారు. ‘అపొజిషన్‌లో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు మరో మాట. ఎవరు మాట్లాడినా తప్పే‘ అని జగ్గారెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియా ద్వారా ప్రకటన విడుదల చేశారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించడం, డిమాండ్ చేయడం, ప్రతిపక్షం నుంచి అధికారంలోకి వచ్చినప్పుడు వాటిని విస్మరించడం తప్పేనని కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతున్న సమయంలో జగ్గారెడ్డి (Jagga Reddy) సలహాలు ఇవ్వకుండా, వ్యక్తిగత ఎజెండాతో ముందుకెళ్లడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని, సొంత పార్టీపైనే సెటైర్లు వేయడంపై ఏంటని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం జగ్గారెడ్డి కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

Read Also: ఆర్టీసీ సమ్మెలో తీవ్ర ఉద్రిక్తత.. ఒంటికి నిప్పంటించుకుని డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>