కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ (Nalgonda) వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం (Agricultural Market Committee) పదవీ కాలాన్ని ఆరు నెలలపాటు పొడగించారు. ఈ మేరకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమిషనర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా తిప్పర్తి మండలానికి చెందిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు జూకూరి రమేశ్‌కు అవకాశం దక్కింది. 2024 మార్చి 12న నల్లగొండ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం బాధ్యతలు చేపట్టగా, ఈనెల 12న ముగిసింది.
తాజాగా పాలకవర్గం పదవి కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించడంతో మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేశ్ పాలకవర్గం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ రమేశ్ మాట్లాడుతూ.. మంత్రి కోమటిరెడ్డి సహకారంతో రైతుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కృషి చేస్తానని తెలిపారు. మార్కెట్, ప్రభుత్వ నిధులతో రైతులకు లబ్ధి చేకూర్చే కార్యక్రమాలను చేపడతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తిప్పర్తి మాజీ జడ్పీటీసీ పాశం రామ్ రెడ్డి, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, నల్లగొండ మాజీ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.

