హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. సజ్జనార్ కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (VC Sajjanar) కీలక ప్రకటన చేశారు. వర్షాల కారణంగా, రోడ్లపై నీరు నిలిచి, ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోందన్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. మరీ ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఇళ్లకే పరిమితం కావాలని విజ్ఞప్తి చేశారు.

అత్యవసరమైతే.. డయల్ 100

భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు అత్యవసరమైతే డయల్ 100 సేవలు ఉపయోగించుకోవాలని కమిషనర్ వీసీ సజ్జనార్ (VC Sajjanar) తెలిపారు. ప్రయాణం తప్పనిసరైతే.. నెమ్మదిగా వెళుతూ ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటిస్తూ వెళ్లాలన్నారు. ప్రయాణానికి కొంత అదనపు సమయం కేటాయించుకోవాలన్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అప్డేట్స్ ఇస్తుంటామని.. ఫాలో కావాలని సూచించారు.

Read Also: మలేషియా గోల్ఫ్ టోర్నీలో మెరిసిన గుంతాస్..

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>