ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే వేముల

కలం, నల్లగొండ బ్యూరో : ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక (Praja Palana – Pragati Pranalika) 99 రోజుల సన్నాహక సమావేశంలో వేముల వీరేశం పాల్గొని అధికారులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రాథమిక సమస్యలను గుర్తించాలని ఎమ్మెల్యే సూచించారు.

ప్రజల అవసరాలను తెలుసుకోవడమే కాకుండా వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఈ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పాలనను ప్రజల వద్దకు చేరవేసేందుకే ఈ 99 రోజుల ప్రణాళికను రూపొందించినట్లు ఆయన (Vemula Veeresham) తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి విన్నపాన్ని సానుకూలంగా పరిశీలించి, నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కారం చూపేలా యంత్రాంగం పనిచేయాలని సూచించారు. సమావేశంలో నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ చెవుగోని రజిత శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, స్థానిక కౌన్సిలర్లు, వివిధ విభాగాల అధికారులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Read Also: బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్.. గోల్డెన్ ఛాన్స్ మిస్…

Follow Us On: Pinterest

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>