ఏపీలో వాహనదారులకు షాక్..!

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీ ప్ర‌భుత్వం వాహ‌న‌దారుల‌కు షాకిచ్చింది. ర‌హ‌దారుల భ‌ద్ర‌త‌కు ప్రత్యేక నిధి, రిపేర్ల కోసం వాహ‌న‌దారుల నుంచి 10 శాతం సెస్ వసూలు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ర‌వాణా శాఖ మంత్రి రాంప్ర‌సాద్ రెడ్డి (Ramprasad Reddy) శాస‌న‌ మండ‌లి (AP Council)లో బిల్లు ప్ర‌వేశ‌పెట్టారు. 2026 జ‌న‌వ‌రి 13 నుంచే ఈ బిల్లు అమ‌లు అవుతుంద‌ని తెలిపారు.

వాహ‌న‌దారులు ఇప్ప‌టికే లైఫ్ ట్యాక్స్‌లో 10 శాతం క‌డుతున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. రాష్ట్రంలో జ‌రిగే రోడ్డు ప్ర‌మాదాలు, ర‌హ‌దారి భ‌ద్ర‌త, రిపేర్ల‌కు దీన్ని ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. దీని వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఆర్థిక భారం ఉండ‌ద‌న్నారు. రాష్ట్రంలో నెల‌కు 73 వేల వాహ‌నాలు, సంవ‌త్స‌రానికి 8 ల‌క్ష‌ల 70 వేల వాహ‌నాలు రిజిస్ట్రేష‌న్లు అవుతున్నాయ‌ని మంత్రి వెల్ల‌డించారు. దీని ద్వారా రాష్ట్రానికి నెల‌కు రూ.22.5 కోట్లు, సంవ‌త్స‌రానికి రూ.2.75 ల‌క్ష‌ల కోట్లు ఆదాయం స‌మ‌కూరుతుంద‌ని చెప్పారు.

దీనిపై మండలి (AP Council) చైర్మ‌న్ స్పందిస్తూ ఇప్పుడు వసూలు చేసేది కాకుండా అద‌నంగా 10 శాతం వసూలు చేస్తారా? అని ప్ర‌శ్నించారు. మంత్రి రాంప్ర‌సాద్ రెడ్డి స‌మాధాన‌మిస్తూ.. జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింద‌ని, ఆ తగ్గిన 10 శాతాన్ని రోడ్ సేఫ్టీ కోసం సెస్‌గా వసూల్ చేస్తామ‌ని చెప్పారు.

Read Also: మాది ప్రజా ప్రభుత్వం.. పరదాల ప్రభుత్వం కాదు: నారా లోకేశ్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>