కలం, వెబ్ డెస్క్: ఇప్పటికే వివాదాస్పంగా మారిన నీట్ (NEET) పరీక్షలో అధికారుల తప్పిదాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. మరికొద్ది గంటల్లో నీట్ పరీక్ష జరుగుతుందన్న తరుణంలో విద్యార్థుల పరీక్ష కేంద్రాల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. నాగపూర్ (Nagpur)కు చెందిన ఓ విద్యార్థి నీట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇటీవల హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న విద్యార్థి తనకు కేటాయించిన ఎగ్జామ్ సెంటర్ చూసి షాకయ్యాడు.
అతడి పరీక్ష కేంద్రం ఏకంగా దేశ సరిహద్దులనే దాటేసింది. తన హాల్ టికెట్‌లో అబుదాబి (Abu Dhabi)లోని నీట్ ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ ఉండటంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. అయితే సదరు విద్యార్థి ఎన్టీఏకు (NTA) ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించారు. పరీక్ష (NEET) కేంద్రం కేటాయింపులో దొర్లిన తప్పులను సరిదిద్దుకొని కొత్త హాల్ టికెట్ జారీ చేశారు. దీంతో విద్యార్థి పరీక్ష రాసేందుకు లైన్ క్లియర్ అయ్యింది. అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: ప్రయాణికులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన రైల్వే జరిమానా!
Follow Us On: Instagram

