Mobile Popup Ad
Mobile Popup Ad

ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిర‌స‌న‌లు.. ధ‌ర్మేంద్ర రాజీనామాకు డిమాండ్

క‌లం, వెబ్ డెస్క్: ఢిల్లీలో జంత‌ర్ మంత‌ర్ వేదిక‌గా మ‌రోసారి కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (Cockroach Janata Party) నిర‌స‌నకు దిగింది. నీట్ అవ‌క‌త‌వ‌క‌లు, విద్యా వ్య‌వ‌స్థ‌లో జ‌రుగుతున్న లోపాల‌కు బాధ్య‌త వ‌హిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయాల‌ని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మానికి వేలాది మంది విద్యార్థులు, ప్ర‌జ‌లు, యువ‌త హాజ‌ర‌య్యారు. జాతీయ జెండాలు, అంబేడ్క‌ర్ చిత్ర‌ప‌టాల‌తో నిర‌స‌నకారులు కేంద్ర‌ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.

మోదీపై సీజేపీ సంచ‌ల‌న పోస్ట్

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (Cockroach Janata Party) ఎక్ష్ ఖాతాలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై సంచ‌ల‌న పోస్ట్ చేసింది. భార‌త చ‌రిత్ర‌లోనే మోదీ అత్యంత వ‌ర‌స్ట్ ప్ర‌ధాని అని మీరు భావిస్తున్నారా అంటూ ఫాలోవ‌ర్ల‌ను ప్ర‌శ్నించింది. అవును, కాదు అనే మీ స‌మాధానాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌జేయాల‌ని పోస్టులో పేర్కొంది. ఈ పోస్టును షేర్ చేయాల‌ని ఫాలోవ‌ర్ల‌కు సూచించింది. దీనికి నెటిజ‌న్లు ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు.

Read Also: నీట్ ప‌రీక్ష‌.. నాగ‌పూర్ విద్యార్థికి అబుదాబిలో సెంట‌ర్‌!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>