Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రయాణికులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన రైల్వే జరిమానా!

కలం, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్ విశ్వాస్ సవరణ చట్టం 2026 ప్రకారం భారతీయ రైల్వే (Indian Railway) కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణించే (Ticketless Travel) వారికి విధించే కనీస జరిమానాను భారీగా పెంచుతూ రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు అమలులో ఉన్న కనీస ఫైన్ 250 రూపాయలను నేటి నుంచి 500 రూపాయలకు పెంచుతూ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. రైల్వే చట్టం 1989 లోని సెక్షన్ 137, 138 సవరణల ప్రకారం ఈ కొత్త జరిమానా విధింపు ఈ రోజు నుంచి అమలు కానుంది.

రైళ్లలో అనధికారిక ప్రయాణాలను అరికట్టేందుకు, ప్రయాణికుల్లో బాధ్యతను పెంచేందుకు రైల్వే బోర్డు (Indian Railway) ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా టికెట్ ప్రయాణికుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటంతో తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కేవలం సెంట్రల్ రైల్వే పరిధిలోనే మే నెలలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఏకంగా 4.96 లక్షల మంది టికెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడ్డారు. ఈ ఒక్క జోన్ నుంచే మే నెలలో జరిమానాల రూపంలో 40.85 కోట్ల రూపాయల భారీ వసూళ్లు జరిగాయని రైల్వే అధికారులు వెల్లడించారు. తాజా నిబంధనలతో ప్రయాణికులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే టికెట్లతోనే ప్రయాణించాలని, లేదంటే రెట్టింపు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Read Also: ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిర‌స‌న‌లు.. ధ‌ర్మేంద్ర రాజీనామాకు డిమాండ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>