కలం, వెబ్ డెస్క్ : ప్రజలకు రక్షణగా నిలిచి వాళ్ల సమస్యలు తీర్చాల్సిన పోలీసులు అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. బాధితులపైనే దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనే నాగర్ కర్నూల్ (Nagarkurnool) జిల్లాలో చోటు చేసుకుంది. అవంచ గ్రామంలో ఓ యువతిపై పుకార్లు పుట్టించాడని.. మహేందర్ అనే వ్యక్తిపై తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వచ్చింది.
దీంతో విచారణ పేరుతో తనను పిలిచి ఎస్సై శ్రీనివాసరావు విచక్షణారహితంగా చితకబాదారని మహేందర్ ఆరోపించారు. దాహం వేస్తుందని అడగడంతో పోలీసులు తనపై మూత్రవిసర్జన చేశారని బాధితుడు తీవ్ర ఆరోపణ చేశాడు. అమానవీయంగా ప్రవర్తించిన ఎస్సై పై చర్యలు తీసుకోవాలని మహేందర్ కుటుంబసభ్యులు డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్ కు ఫిర్యాదు చేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. తనకు నివేదిక ఇవ్వాలని నాగర్ కర్నూల్ సీఐ అశోక్ రెడ్డికి డీఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.

