వనపర్తిలో ర్యాపిడో సేవలు ప్రారంభం

కలం, వనపర్తి: పట్టణ ప్రజలకు సౌకర్యవంతమైన, సురక్షితమైన, ఇబ్బందుల్లేని ప్రయాణ సదుపాయాలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (Tudi Megha Reddy) అన్నారు. వనపర్తి (Wanaparthy) పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ర్యాపిడో సేవలను (Rapido Services) బుధవారం ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సుమారు 180 మంది రైడర్లతో ర్యాపిడో సేవలను ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. వనపర్తి పట్టణంలో ప్రతిరోజూ దాదాపు 40 వేల నుంచి 45 వేల మంది వివిధ అవసరాల కోసం రాకపోకలు సాగిస్తుంటారని తెలిపారు. తక్కువ సమయంలో, సౌకర్యవంతంగా ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరేందుకు ర్యాపిడో సేవలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

వనపర్తి పట్టణం రోజురోజుకూ విస్తరిస్తూ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా రవాణా సౌకర్యాలను కూడా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజులలో ర్యాపిడో సేవలను మరింత విస్తరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు. ర్యాపిడో సేవల నిర్వహణలో ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అన్ని అనుమతులు, అవసరమైన పత్రాలు కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు సేవల నాణ్యత విషయంలో రాజీపడకుండా విశ్వసనీయమైన రవాణా సదుపాయం అందించాలని అన్నారు.

ర్యాపిడో సేవల ప్రారంభంతో పట్టణ ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడటంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు లభించడం సంతోషకరమని మేఘారెడ్డి పేర్కొన్నారు. యువత తమ నైపుణ్యాలను వినియోగించుకుని స్వయం ఉపాధి పొందుతూ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవాలని సూచించారు. వనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి అనుగుణంగా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ప్రతి కార్యక్రమానికి తన సహకారం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.

భవిష్యత్తులో రవాణా, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు మరింత పెరిగేలా కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో వనపర్తి పట్టణ అధ్యక్షుడు కదిరె రాములు, జిల్లా యూత్ అధ్యక్షుడు వాకిటి ఆదిత్య, ఎస్‌ఎల్‌ఎన్ రమేష్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, కౌన్సిలర్లు క్రాంతి, పరుశురాం, బి.కృష్ణ, ఏర్పుల రవి, పాల రవి, రఘు, మైనార్టీ నాయకులు రహీం, వక్ఫ్‌బోర్డు సభ్యులు, రఫిక్, సలీం, ఆర్టీఏ సభ్యులు జహంగీర్, సమీర్, మైనార్టీ నాయకులు వసీం, ఇర్ఫాన్, జమీల్, ఆయూబ్ ఖాన్, కైసర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>