సర్పంచి అభ్యర్థుల బంపరాఫర్.. మతి పోవాల్సిందే!

కలం, వెబ్ డెస్క్: ఏపీలో సర్పంచి ఎన్నికల (AP Sarpanch Elections) హడావిడి మొదలైపోయింది. నవంబర్ 26, 29, డిసెంబర్ 2వ తేదీల్లో పోలింగ్ జరగబోతుంది. ఒకవైపు పోటీకి అభ్యర్థులు రెడీ అవుతుంటే.. మరోవైపు ఏకగ్రీవాల కోసం చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే కొందరు ఆశావహులు ఇస్తున్న బంపరాఫర్లు చర్చనీయాంశంగా మారాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామంలో ఒక వ్యక్తి తననున ఊరి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ.2 కోట్లు ఇస్తానని.. ఊరిని సమూలంగా అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా దుళ్ల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తనను సర్పంచిగా ఎన్నుకుంటే రూ.కోటి ఇస్తానని అందరి ముందే మాట ఇచ్చాడు. ఆయనకు పోటీగా ఉన్న మరో వ్యక్తి తనను ఎన్నుకుంటే రూ.1.50 కోట్లు ఇస్తానని స్పష్టం చేశారు.

రూ.50 లక్షలు.. ఎకరం భూమి..

కడియం మండలంలోని ఒక గ్రామంలో రూ.కోటి ఇస్తానని అభ్యర్థి మాట ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుతాళ్లు గ్రామంలో సర్పంచి పదవికి ఎన్నుకుంటే వెంటనే రూ.50 లక్షలు ఇస్తానని హామీ ఇస్తున్నారు. మరో అభ్యర్థి తన ఎకరం భూమిని పంచాయతీకి రాసిస్తానని చెబుతున్నారు. దీంతో ఎవరికీ అవకాశం ఇవ్వాలనేదానిపై ఆయా గ్రామాల్లో చర్చలు జరగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇలాంటి ఆఫర్లు మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, బలవంతపు ఏకగ్రీవాలు చెల్లవు. తరువాత ఇది నిరూపితమైనా ఎన్నికలు రద్దు చేసి మళ్లీ నిర్వహించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>