కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో 21 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ (Telangana IPS Transfers) అయ్యారు. హైదరాబాద్ సీపీగా సజ్జనార్ స్థానంలో మహేశ్ భగవత్ నియమితులయ్యారు. సజ్జనార్‌ను ఫైర్, డిజాస్టర్ సర్వీసెస్ డీజీగా బదిలీ చేశారు. ఉమెన్ అండ్ సేఫ్టీ కమిషనర్, షీ టీమ్స్ డీజీగా సౌమ్య మిశ్రాను బదిలీ చేశారు. ఆమెకు పోలీస్ ఆర్గనైజేషన్, పోలీస్ లీగల్ విభాగాల డీజీపీగానూ నియమించారు. సీఐడీ డీజీపీగా ఉన్న చారు సిన్హాకు ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఆర్టీసీ ఛైర్మన్, ఎండీగా అనిల్ కుమార్, పౌర సరఫరాల శాఖ డీజీగా నాగిరెడ్డి, జైళ్ల శాఖ, హోం గార్డ్స్ డీజీపీగా స్వాతి లక్రా, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ డీజీతో పాటు పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ బాధ్యతలను విక్రమ్ సింగ్ మాన్కు, పోలీస్ సిబ్బంది ట్రైనింగ్ విభాగానికి అదనపు డీజీపీగా సంజయ్ కుమార్ జైన్‌కు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో డైరెక్టర్‌గా స్టీఫెన్ రవీంద్రను నియమించారు.
అకున్ సభర్వాల్‌కు కీలక బాధ్యతలు..
కేంద్ర సర్వీసుల నుంచి ఇటీవలే రాష్ట్రానికి వచ్చిన అకున్ సభర్వాల్‌ను లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీగా నియమించారు. యాంటీ కరప్షన్ బ్యూరో ఐజీగా ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీగా కార్తికేయ, రైల్వే ఐజీగా కె.రమేష్ నాయుడు, రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ విభాగాల జాయింట్ డైరెక్టర్‌గా జోయల్ డేవిస్, డీఐజీ ఇంటెలిజెన్స్‌గా ఆర్. భాస్కరన్ నియమితులయ్యారు. బాసర జోన్ డీఐజీగా కె.నారాయణ నాయక్, చార్మినార్ జోన్ డీఐజీగా ఎల్.ఎస్.చౌహాన్‌ను నియమించి, ఆయనకు కోఆర్డినేషన్ డీఐజీ బాధ్యతలు అప్పగించారు. జోగులాంబ జోన్ డీఐజీగా చందనా దీప్తికి అదనపు బాధ్యతలు అప్పగించారు. టీజీ-టీఎంఏఆర్ఎస్ డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్)గా శ్రీ బాలాదేవి, హైదరాబాద్ సిటీ డీసీపీగా వి.అరవింద బాబును నియమించారు. GO చదవడం కోసం కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Also Read : భారత్ వ్యతిరేక శక్తుల కోసమే రాహుల్ పనిచేస్తున్నారు: కిషన్ రెడ్డి
Follow Us On: X(Twitter)

