Mobile Popup Ad
Mobile Popup Ad

‘లెనిన్’ ఫస్ట్ కట్ చూశా.. నాగార్జున ఇంట్రెస్టింగ్ ట్వీట్

కలం, సినిమా : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్(Akhil Akkineni) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్'(Lenin). మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో అఖిల్ సరసన క్యూట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా కోసం అఖిల్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్‌కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.

అయితే వరుసగా రిలీజ్ వాయిదా పడటంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో ఇంట్రెస్ట్ పోతుందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా లెనిన్ మూవీకి సంబంధించి అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. తన ట్వీట్‌లో, ‘నిన్న రాత్రి మా సినిమా ‘లెనిన్’ ఫస్ట్ కట్ చూశాను. గర్వంగా, నమ్మకంగా చెబుతున్నాను.. జూన్ 26, 2026న మీరు కొత్త అఖిల్‌ను చూడబోతున్నారు. ఆ తేదీ గుర్తుంచుకోండి.. థియేటర్లలో కలుద్దాం.” అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో అఖిల్ అక్కినేని అభిమానులలో సరికొత్త ఉత్సాహం వచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>