Mobile Popup Ad
Mobile Popup Ad

‘దూత 2’తో కొత్త ప్రయాణం.. నిర్మాతగా తొలి అడుగు వేసిన నాగ చైతన్య

కలం, సినిమా : అమెజాన్ ప్రైమ్ వీడియోలో సంచలన విజయం సాధించిన సూపర్ నేచురల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘దూత’ రెండో సీజన్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లో గ్రాండ్ పూజా కార్యక్రమంతో ఈ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కింగ్ నాగార్జున హాజరయ్యారు. ముహూర్తపు షాట్‌కు స్వయంగా క్లాప్ కొట్టి టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ భారీ ప్రాజెక్ట్‌తో  యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) నిర్మాతగా కొత్త అవతారం ఎత్తారు. శరత్ మరార్‌తో కలిసి భారీ బడ్జెట్‌తో ఈ సీజన్‌ను నిర్మిస్తున్నారు.

టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ఈ సిరీస్ రూపొందుతోంది. మొదటి సీజన్‌కు వచ్చిన అద్భుత స్పందనతో ‘దూత 2’(Dhootha 2)  పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కథలో మరింత లోతైన మిస్టరీ, సూపర్ నేచురల్ హారర్ అంశాలు, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు ఉండనున్నట్లు సమాచారం. మొదటి సీజన్‌లో కీలక పాత్రలలో నటించిన పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్ ఈ సీక్వెల్‌లో కూడా కొనసాగుతున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మోస్ట్ అవేటెడ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>