Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీ లిక్క‌ర్ స్కామ్‌.. సిట్‌కు లొంగిపోయిన అవినాశ్ రెడ్డి

క‌లం, వెబ్ డెస్క్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌ద్యం కుంభ‌కోణం (AP Liquor Scam) కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ7గా ఉన్న ముప్పిడి అవినాశ్ రెడ్డి (Muppidi Avinash Reddy) అధికారుల‌కు లొంగిపోయారు. నేడు ఉద‌యం అవినాశ్ రెడ్డి విజ‌య‌వాడ సిట్ (SIT) కార్యాల‌యానికి వ‌చ్చారు. ఈ కేసులో ముంద‌స్తు బెయిల్ కోసం ఇటీవ‌ల అవినాశ్ రెడ్డి సుప్రీం కోర్టులో ముంద‌స్తు పిటిష‌న్ వేశారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్థానం బెయిల్ పిటిష‌న్‌ను తిర‌స్క‌రించింది. దీంతో అవినాశ్ రెడ్డి త‌న లాయ‌ర్‌లో క‌లిసి సిట్ ఆఫీస్‌కు వ‌చ్చారు. గ‌తంలోనూ ఆయ‌న హైకోర్ట్‌లో బెయిల్ పిటిష‌న్ వేయ‌గా కోర్టు తిర‌స్క‌రించింది. ఆ స‌మ‌యంలో ఆయ‌న విదేశాల‌కు ప‌రార‌య్యేందుకు ప్ర‌య‌త్నించారు. ఇప్పుడు సుప్రీం కోర్ట్‌లోనూ సీన్ రిపీట్ కావ‌డం, లొంగిపోవాల‌ని న్యాయ‌స్థానం ఆదేశించ‌డంతో చేసేదేం లేక లొంగిపోయారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>