జహీరాబాద్ మీదుగా బుల్లెట్ ట్రైన్ .. కేంద్ర మంత్రికి ఎమ్మెల్సీ విజ్ఞప్తి

కలం, మెదక్ బ్యూరో : ముంబై – హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ (Zaheerabad) మీదుగా నిర్మించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి ఎమ్మెల్సీ డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. ముంబై – హైదరాబాద్ మధ్య జహీరాబాద్ కు తక్కువ దూరం కలిగిన మార్గంగా ఉంటుందని, ఇక్కడ నిమ్జ్ నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ ఉన్నాయన్నారు.

జహీరాబాద్, సంగారెడ్డి, సదాశివపేట, పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతాల్లోని వందలాది జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమల అభివృద్ధికి, లక్షలాది మంది ఉద్యోగులు, వ్యాపారవేత్తల రవాణా సౌకర్యానికి ఈ బుల్లెట్ ట్రైన్ రూట్ ఎంతో కీలకంగా మారుతుందని తెలిపారు.​ తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రాంతీయ అనుసంధానానికి, ఆర్థిక వృద్ధికి ఈ మార్గం ఎంతో దోహదపడుతుందన్నారు. భవిష్యత్ ను , ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తగిన ఫీజిబిలిటీని చూసి, బుల్లెట్ ట్రైన్ కు జహీరాబాద్‌ను ప్రధాన స్టేషన్‌గా పరిగణించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>