తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత కొండా లక్ష్మణ్: ఎమ్మెల్యే రామారావు పటేల్

కలం, కుంటాల: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత, స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను కుంటాల మండలం కల్లూర్ గ్రామం (Kallur Village) లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చౌక్‌లో ఆయన చిత్రపటానికి ముధోల్ ఎమ్మెల్యే (Mudhole MLA) పవార్ రామారావు పటేల్ (Pawar Ramarao Patel) పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటం, త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. బాపూజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>