అల్కరాజ్ ఊచకోత.. యూరప్‌కు లీడ్!

కలం, స్పోర్ట్స్ : లేవర్ కప్ (Laver Cup 2026) టెన్నిస్ టోర్నమెంట్‌లో టీమ్ యూరప్ ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. లండన్‌లోని ఓ2 అరేనాలో శనివారం జరిగిన రెండో రోజు పోటీల్లో కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) అద్భుత విజయం సాధించడంతో టీమ్ యూరప్.. టీమ్ వరల్డ్‌పై 7-5తో ముందంజలో నిలిచింది. రెండో రోజు ఆరంభంలో టీమ్ వరల్డ్ జోరందుకుంది. సింగిల్స్‌లో లర్నర్ టీన్ 3-6, 6-2, 10-7తో ఫ్లేవియో కొబొల్లిని ఓడించాడు. మరో మ్యాచ్‌లో అలెక్స్ డి మినార్ 2-6, 7-6, 11-9తో అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై విజయం సాధించాడు. దీంతో టీమ్ వరల్డ్ పోటీలోకి బలంగా వచ్చింది.

అనంతరం జరిగిన ఉత్కంఠభరిత సింగిల్స్ మ్యాచ్‌లో కార్లోస్ అల్కరాజ్ 6-3, 4-6, 13-11తో టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించాడు. గత ఏడాది శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన లేవర్ కప్‌లో ఫ్రిట్జ్ చేతిలో ఎదురైన ఓటమికి అల్కరాజ్ ఈ విజయంతో బదులిచ్చాడు. మ్యాచ్‌లో రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకున్న అల్కరాజ్ తీవ్ర ఒత్తిడిని అధిగమించి విజయం సాధించాడు. ప్రారంభంలో కొంత ఆందోళనకు గురైనప్పటికీ చివరకు మ్యాచ్‌ను గెలవడం ఎంతో సంతోషంగా ఉందని మ్యాచ్ అనంతరం అల్కరాజ్ పేర్కొన్నాడు. చివరి డబుల్స్ మ్యాచ్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్, కాస్పర్ రూడ్ జంట 6-4, 7-6తో అలెగ్జాండర్ బబ్లిక్, బ్రాండన్ నకాషిమా జోడీపై విజయం సాధించింది. దీంతో టీమ్ యూరప్ 7-5తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆదివారం జరిగే చివరి రోజు ప్రతి మ్యాచ్‌కు మూడు పాయింట్లు కేటాయించనున్నారు. ముందుగా 13 పాయింట్లు సాధించిన జట్టు లేవర్ కప్ విజేతగా నిలుస్తుంది. దీంతో చివరి రోజు మ్యాచ్‌లపై టెన్నిస్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>