కలం, నిర్మల్ : ముధోల్ నియోజకవర్గ ప్రజలకు రాజకీయాలకు అతీతంగా సేవ చేయడమే తన ధ్యేయమని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Pawar Rama Rao Patel) అన్నారు. ఆదివారం భైంసా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) కింద 125 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.55.58 లక్షల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక భారం తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతోందన్నారు.
ప్రజలకు సకాలంలో సహాయం అందించాలనే ఉద్దేశంతో తన కార్యాలయంలో ప్రత్యేకంగా సీఎంఆర్ఎఫ్ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పవార్ రామారావు పటేల్ (Pawar Rama Rao) సూచించారు. ఈ కార్యక్రమంలో భైంసా మున్సిపల్ చైర్మన్ తుమ్మల దత్తాత్రి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్, వివిధ గ్రామాల సర్పంచులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Also: ఆర్మూర్‌లో వేడెక్కిన రాజకీయం.. కాంగ్రెస్, బీజేపీ బిగ్ ఫైట్!
Follow Us On: Sharechat

