కలం, కుంటాల : గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ (Pawar Ramarao Patel) అన్నారు. కుంటాల మండలం లింబా (కె) గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన మహిళా సమైక్య భవనం, హెల్త్ సెంటర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే రూ.12 లక్షలతో నిర్మించనున్న అంగన్‌వాడీ భవనానికి భూమిపూజ చేశారు. అనంతరం లింబా (బి) గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మించనున్న గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే (Mudhol MLA) మాట్లాడుతూ.. ఇప్పటికే గ్రామాలకు పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేశామని, ప్రజలు ఐక్యంగా ఉండి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని సూచించారు. గత పాలకుల పదేళ్ల నిర్లక్ష్యంతో గ్రామాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ విజయలక్ష్మి, సర్పంచులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

