బోనకల్ స్కూల్‌లో గాయపడిన విద్యార్థినులకు MRPS పరామర్శ

కలం, బోనకల్: ఖమ్మం జిల్లా బోనకల్ (Bonakal) ఇంటిగ్రేటెడ్ స్కూల్‌లో సీలింగ్ పెచ్చులూడి గాయపడిన విద్యార్థినులు పూజిత, కీర్తనలను ఎమ్మార్ఫీఎస్ (MRPS) బోనకల్ బృందం పరామర్శించింది. అనంతరం పాఠశాల భవనాన్ని, తరగతి గదులను పరిశీలించింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థులకు సురక్షితమైన విద్యా వాతావరణం కల్పించాల్సిన ప్రభుత్వమే నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. సరైన వసతులు, భద్రతా చర్యలు లేకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై ఆశతో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తుంటే, ఇలాంటి ప్రమాదాలు జరగడం ఆందోళనకరమన్నారు. పాఠశాల భవనంలో గతంలో జరిగిన ఘటనతో పాటు, ప్రస్తుతం సీలింగ్ పెచ్చులూడి విద్యార్థినులు గాయపడటం పాఠశాల నిర్వహణలో నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎమ్మార్ఫీఎస్, ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. బాధ్యులపై, ముఖ్యంగా స్కూల్ ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో MRPS రాష్ట్ర నాయకులు చిలక నాగరాజు, MSP జిల్లా నాయకులు కోట హనుమంతరావు, మండల ప్రధాన కార్యదర్శి మర్రికంటి గంగాధర్, విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Also Read : పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు బిగ్ అలర్ట్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>