పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు బిగ్ అలర్ట్

కలం, వెబ్ డెస్క్: పాస్‌పోర్ట్ దరఖాస్తుదారుల కోసం హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయం కీలక ప్రకటన జారీ చేసింది. నవంబర్ 21న పాస్‌పోర్ట్ మేళా (Passport Mela) నిర్వహించబోతున్నామని.. 4 వేల అపాయింట్‌మెంట్లు అందుబాటులోకి తెస్తున్నట్లు పాస్‌పోర్ట్ అధికారి మాధవ్ సుల్ఫులే తెలిపారు. సాధారణ పాస్‌పోర్ట్ సేవలతో పాటు తత్కాల్ పాస్‌పోర్ట్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ సేవల అపాయింట్‌మెంట్లను బుక్ చేసుకోవచ్చు.

నవంబర్ మూడో తేదీ నుంచే హైదరాబాద్ కార్యాలయంతో పాటు వివిధ జిల్లాల్లో ఉన్న అన్ని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు, పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ కేంద్రాల్లో అపాయింట్‌మెంట్లను బుక్ చేసుకోవచ్చని వివరించారు. పాస్‌పోర్ట్ బుకింగ్స్ పెరుగుతుండటం, అపాయింట్‌మెంట్ల వెయిటింగ్ పీరియడ్ దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక మేళా నిర్వహిస్తున్నట్లు మాధవ్ సుల్ఫులే స్పష్టం చేశారు. పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>