ఇద్దరు పిల్లలకు ఉరేసి తల్లి ఆత్మహత్య

కలం, వెబ్ డెస్క్: వికారాబాద్ (Vikarabad) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చౌడాపూర్ మండలం అడవి వెంకటాపూర్ గ్రామానికి చెందిన నవనీత (27) తన ఇద్దరు పిల్లలు ఏడేళ్ల విఘ్నేష్, ఐదేళ్ల మధుప్రియకు ఉరి వేసి, ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘోరానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కొంత కాలంగా భర్త జంబుల మల్లేష్ (32)తో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనస్థాపంతో నవనీత బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>