వర్షాకాలంలో ఈ ఆహారాలు అస్సలు తినొద్దు.. నిపుణుల హెచ్చరిక

కలం, వెబ్ డెస్క్: వర్షాకాలంలో చాలా మంది జబ్బుల బారిన పడుతుంటారు. దీనికి ప్రధాన కారణం వాతావరణంలో జరిగే మార్పులేనని మనందరం అనుకుంటాం. కానీ మనం తినే ఆహార పదార్థాలు కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని మీకు తెలుసా?

సాధారణంగా వర్షాకాంలో వెదర్ చల్లగా ఉండటంతో వేడి వేడి బజ్జీలు, సమోసాలు, ఫ్రైడ్ ఫుడ్స్ వంటివి తినడానికి చాలా మంది ఇష్టపడతారు. ఇవే మనల్ని జబ్బుల బారిన పడేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే వర్షాకాలంలో జీర్ణక్రియ మందకొడిగా ఉంటుంది. ఈ కాలంలో ఆయిల్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ తినడం వలన అవి త్వరగా జీర్ణం కాకపోగా జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. వర్షాకాలంలో అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు కొన్ని ఆరోగ్య చిట్కాల (Monsoon Health Tips) ను సూచించారు. అవేమిటో తెలుసుకుందాం.

వర్షాకాలంలో ఎక్కువగా తినకూడని పదార్థాలు

పానీపూరీ: ఈ మధ్య కాలంలో స్కూల్ పిల్లల దగ్గరి నుంచి పెద్దవాళ్ల వరకు ఎక్కువగా ఇష్టపడే పదార్థం పానీపూరీ. కానీ వర్షాకాంలో బయట దొరికే పానీపూరీ తినడం వల్ల విరేచనాలు, పచ్చ కామెర్లు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు. పానీపూరీ తయారీలో వాడే కలుషితమైన నీరే దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

పండ్ల రసాలు: వర్షాకాలంలో బయట దొరికే పండ్ల రసాలను తాగొద్దని సూచిస్తున్నారు. ఎందుకంటే బయట విక్రయించే జ్యూస్‌లలో కలుషితమైన నీరు లేదా ఐస్‌ను వాడతారు. దీని వల్ల ఆరోగ్యానికి హానీ జరుగుతుంది. అయితే ఇంట్లో జ్యూస్‌లు ప్రిపేర్ చేసుకుని తాగవచ్చని సూచిస్తున్నారు.

మాంసాహారం: కూరగాయాలు, ఆకుకూరలతో పోలిస్తే మాంసాహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే వర్షాకాలంలో మాంసాహారం తినడం వల్ల అది సరిగ్గా జీర్ణించుకునే శక్తి లేక కడుపు ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాకుండా వర్షాకాలంలో తేమ కారణంగా మాంసంపై బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి వృద్ధి చెందుతాయి. దీనివల్ల అనేక రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది.

కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు: కొంతమంది మహిళలు పండ్లు, కూరగాయలు ముందురోజు రాత్రే కట్ చేసుకుని పెట్టుకుంటారు. ఇలా కట్ చేసి పెట్టడం వలన వాటిపై బ్యాక్టీరియా చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిని అలాగే తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే వర్షాకాలంలో కూరగాయలను ఎప్పటికప్పుడు కట్ చేసుకోవడమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

రోగాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కాచి చల్లార్చిన నీళ్లు తాగడం వలన వ్యాధుల బారినుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాకుండా తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం కూడా చాలా ముఖ్యమని చెబుతున్నారు. వీటితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి రోగాల బారిన పడకుండా ఉంటారని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. బయట నుంచి తెచ్చిన పండ్లు, కూరగాయలను ఉప్పు నీటిలో లేదా కొద్దిగా వంటసోడా వేసిన నీటిలో 15 నిమిషాల పాటు నానబెట్టి ఆ తర్వాత నీటితో శుభ్రంగా కడగాలని సూచిస్తున్నారు.

(Note: ఈ సమాచారం కేవలం పాఠకుల ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. అర్హుల సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఈ చిట్కాలను పాటించే ముందు మీరు వైద్యుడిని సంప్రదించగలరు)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>